ఆసిఫాబాద్, సామాజిక స్పందన
గిరిజనులపై పెట్టిన పోడు భూముల కేసులన్నీ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆసిఫాబాద్, సర్పూర్(టి) నియోజకవర్గాల ఆదివాసీలకు పోడు పట్టాలు, రైతు బంధు చెక్కులు సీఎం చేతుల మీదుగా అందజేశారు..
Best smart watch 👉ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ''గతంలో వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు వ్యాధులతో సతమతం అయ్యేవారు. 'మంచం పట్టిన మన్యం' అని పతాక శీర్షికలతో పత్రికల్లో వచ్చేది. కానీ, ఇప్పుడా దుస్థితి లేదు. మిషన్ భగీరథ నీళ్లతో వ్యాధులు రావడం బాగా తగ్గిపోయింది. మారుమూల ఆసిఫాబాద్‌కు కూడా వైద్యకళాశాల తెచ్చుకున్నాం. వార్ధానదిపై వంతెన కావాలని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అడిగారు.. ఇప్పుడే మంజూరు చేస్తున్నా. ఆసిఫాబాద్‌కు ఐటీఐ కావాలని అడిగారు.. అది కూడా మంజూరు చేస్తున్నా. నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.
అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల, లంచగొండుల రాజ్యం వస్తుంది. ధరణి ఉండాలా.. వద్దా? మీరే చెప్పండి. రైతుల కోసమే ధరణి తెచ్చాం. నయా పైసా బిల్లు కట్టకుండా ఉచిత కరెంటు ఇచ్చే సదుపాయం దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. పోడు భూములకు 3ఫేజ్ కరెంటు ఇస్తాం. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అక్కడ కూడా అమలు చేయాలని మహారాష్ట్ర రైతులు కోరుతున్నారు. లేదంటే తెలంగాణలో కలిపేయాలని మహారాష్ట్రలోని వివిధ గ్రామాల సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో భారాసకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నా'' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో భారాస ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, బాల్క సుమన్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..












0 Comments